Tuesday, 3 November 2026

కన్నుల విందుగా సాగనున్నా సీతారాముల కల్యాణం

 

 

 

 

 

 

 

కొడకండ్ల, ఫిబ్రవరి06(జనంసాక్షి)
దక్షిణ అయోధ్య రాజుగా పేరుగాంచిన శ్రీరాముడు కి సీతాకిచ్చి వివాహం చేసే రోజు సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది.కొడకండ్ల మండలంలోని లక్ష్మకపల్లి గ్రామ శివారులో ఉన్న పెద్దబాయ్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయంలో రేపు జరగబోయే సీతారాముల కల్యాణానికి సీతారాములు రంగురంగుల పూలు, స్వాగత తోరణాలతో పెళ్లి వేడుకకు ముస్తాబైంది. ముత్యాల ముగ్గులు, తీరొక్కపూలతో అలంకరించిన పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది. సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామము, పూలజడ, బుగ్గన చుక్కతో వధువు సీతమ్మ తల్లి పెళ్లికి ముస్తాబయ్యారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు కన్నుల పండుగగా జరగనున్న కల్యాణంఉదయం 10.30గం. తిరుకల్యాణ మహోత్సవంతో కల్యాణ క్రతువు ప్రారంభంకానుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో రాములోరి పెండ్లి జరగనుంది. సీతారాముల కల్యాణం నేపథ్యంలో భక్త జనులు అధిక సంఖ్యలో తరిలి రావాలని దేవస్థాన కమిటీ మెంబర్లు మోహన్రావు,రామచంద్రరావు,రఘుకుమారాజు,సాయి బాబు రావు,కిష్టయ్య,లింగయ్య,సత్యనారాయణ, సోమేశ్వరరావు,నాగరాజు,పూజారి లక్ష్మణాచార్యులు , కోరారు.