భూ ఆక్రమణలపై ఉక్కుపాదం
ప్రత్యేక చర్యలు తసీఉకుంటున్న కలెక్టర్ యోగితారాణ
హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా ఇట్టే పట్టేస్తున్నారు. ఈ మేరకు అలాంటి భూముల్లో అక్రమంగా ఎవరైనా కట్టడాలు ప్రారంభించినా కూల్చేస్తున్నారు. కాపాడేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోట్ల రుపాయల విలువైన ప్రభుత్వ భూములు కాపాడుతూ ల్యాండ్ బ్యాంక్‌లో చేర్చుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం కఠినంగా ఉంటోంది.జిల్లాలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు అధికారులు వినూత్న మార్గంలో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలను వీఆర్వోలకు అప్పగించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించాలని.. స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులు అదేశలిచ్చారు.ప్రభుత్వ స్థలాల్లో పాతిన బోర్డులను తొలగించినా.. ప్రహరీలు, ఫెన్సింగ్‌లు కూల్చినా ఆయా స్థలాల్లో నిర్మాణాలు వెలిసినా ఇకపై వీఆర్వోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిర్మాణాలు వెలిస్తే 24 గంటల్లో ఎమ్మార్వోకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్థలాలను కాపాడేందుకు ఆన్లైన్ వెకేట్ ల్యాండ్ మానిటరింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. అటు వీఆర్వోలు, వీఆర్ఏలు ప్రభుత్వ స్థలాలను రోజు పరిశీలిస్తూ అక్కడి నుంచి స్థలం ఫొటోను తీసి వెబ్సైట్లో పొందుపర్చాలి. ఇందుకు వీఆర్వోలందరికీ టా/-లబెట్ పీసీలను అందజేశారు. వీఆర్వోలు పంపించిన ఫొటోలను ఉన్నతాధికారులు పరిశీలించి తేడాలు కనిపిస్తే చర్యలు తీసుకోనున్నారు. ఏవైనా నిర్మాణాలు వెలిసినా ఆక్రమణకు గురైనా అధికారులు తక్షణమే రంగంలోకి దిగి రక్షిస్తారు.దీంతో హైదరాబాద్ ల్యాండ్‌బ్యాంక్ కళకళలాడుతున్నది. తాజాగా మరో 9 ల్యాండ్ పార్శిళ్లను జతచేశారు. 10 నెలల్లో రూ. 670 కోట్ల విలువైన 105 పార్శిళ్లను భూనిధిలో చేర్చారు. మరో 96 ల్యాండ్ పార్శిళ్ల ద్వారా 90 ఎకరాలను జమచేయాడానికి సిద్ధం అయ్యారు.జిల్లా రెవెన్యూ అధికారుల సమిష్టి కృషికి తోడు ఈ అంశంపై కలెక్టర్ యోగితారాణా ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లా రెవెన్యూ అధికారులతో తరచూ సవిూక్షలు నిర్వహిస్తూ ల్యాండ్‌బ్యాంక్‌ను పెంచాలని అదేశించారు. దీంతో ఆర్డీవోలతోపాటు ఎమ్మార్వోలు తమ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ భూనిధికి చేర్చుతున్నారు. మొదటిదశలో 80 పార్శిళ్ల ద్వారా 37.06 ఎకరాలను ల్యాండ్‌బ్యాంక్‌లో చేర్చారు. రెండో దఫాలో 16 పార్శిళ్ల ద్వారా 56 ఎకరాలను.. తాజాగా మరో 9 పార్శిళ్లను జమచేశారు. దీంతొ ల్యాండ్బ్యాంక్లోని స్థలాల సంఖ్య 1,054 కు చేరింది. అటు మండలాల్లోనూ కోట్లు విలువైన ప్రజల ఆస్తులను కాపాడారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా భూనిధి ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారులు కోట్ల విలువైన సర్కారు భూములను కాపాడుతూ ల్యాండ్బ్యాంక్లోకి చేర్చుతున్నారు. అధికారుల సమిష్టి కృషి ఫలితంగా భూనిధి రోజురోజుకు బలోపేతమవుతున్నది. జీవో 58,59 కింద వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడం.. ఎన్వోసీల కింద తిరస్కరించిన కేసులు కోర్టుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చిన కేసులకు సంబంధించిన భూములను గుర్తించి వాటిని ల్యాండ్బ్యాంక్కు చేర్చుతున్నారు. తాజాగా మరో 9 ల్యాండ్ పార్శిళ్లను జతచేశారు. గత 10 నెలల్లో రూ. 670 కోట్ల విలువైన 105 పార్శిళ్లను భూనిధిలో చేర్చడం గమనార్హం. మరో 96 ల్యాండ్ పార్శిళ్ల ద్వారా 90 ఎకరాలను జమచేయాడానికి ప్రతిపాదనలు పంపించారు.
——




