Tuesday, 3 November 2026

కమాన్ పూర్ తహసిల్దార్ గా మోహన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ తహసిల్దారుగా గురువారం మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో కమాన్ పూర్ తాసిల్దారుగా పనిచేసిన దత్తు ప్రసాద్ మంచిర్యాల జిల్లాకు బదిలీ కాగా ఆయన స్థానంలో మంచిర్యాలలో పనిచేసిన మోహన్ రెడ్డిని కమాన్ పూర్ కు కేటాయించారు.