రాజలింగు జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం నియమించింది. కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ దాసరి రాజలింగు, ఉపాధ్యక్షులుగా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకులు గుర్రం లక్ష్మీమల్లు నియమితులైనారు. అలాగే డైరెక్టర్లుగా పెళ్లి నారాయణ, ఓడ్నాల రాజు, ఇల్లందుల అశోక్, పప్పు చంద్రమౌళి, కూరాకుల ఓదెలు, భేద సంపత్, అనవేన వేణు, బొల్లంపల్లి రమేష్, మైదం స్వప్న, కోలేటి సత్తయ్య, వంగల లింగారెడ్డి నియమితులైనారు. వీరితో పాటు కమాన్పూర్ సింగల్ విండో చైర్మన్ పెద్ద పెళ్లి జిల్లా మార్కెట్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పెద్దపల్లి కమాన్పూర్ సర్పంచ్ డైరెక్టర్లుగా వ్యవహరించ నున్నారు. త్వరలోనే ఈ నూతన కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.తనను కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు దాసరి రాజలింగు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.





