Wednesday, 4 November 2026

కమాన్ పూర్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

జనంసాక్షి ,కమాన్ పూర్, : కమాన్ పూర్ మండల కేంద్రంలో ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా బుధవారం పోచమ్మ బోనాలను సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి బోనంతో మహిళలు ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా కమాన్పూర్ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ నుండి పోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ పోచమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, కమాన్పూర్ గ్రామ మహిళలు ప్రజలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.