Monday, 2 November 2026

కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. స్థానచలనం కల్పించిన 22 మంది ఐఏఎస్‌ల్లో గ్రేటర్‌లోని పలు విభాగాధిపతులున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమి షనర్ల పేర్లు బదిలీ జాబితాలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి, కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. సీని యర్‌ ఐఏఎస్‌ అధికారి, సీడీఎంఏ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం వాటర్‌బోర్డు ఇన్‌చార్జ్‌ ఎండీగా వ్యవహరిస్తున్నారు. బోర్డుకు రెగ్యులర్‌ ఎండీని నియమించకపోవడంతో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయనే ఇన్‌చార్జ్‌ ఎండీగా కొనసాగే అవకాశాలున్నాయి. హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ శాలినీమిశ్రాను పురపాలక శాఖ నుంచి తప్పించి సాధా రణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆమె స్థానంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా చిరంజీవులు నియమితులయ్యారు. జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్లకూ స్థాన చలనం కలిగింది. నవీన్‌మిట్టల్‌ను సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా, మరో ఐఏఎస్‌ జీ.కిషన్‌ను పాఠశాల విద్య డైరెక్టర్‌గా నియమించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా ఉన్న అనితారామచంద్రన్‌ను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *