* కమీషనరేట్ లో మొక్కలు నాటిన పోలీసు అధికారులు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కమిషనర్ తో పాటు కమిషనరేట్ లోని అన్ని స్థాయిలకు చెందిన అధికారులు మొక్కలను నాటారు. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఆజాది – కా- అమృత్ ఉత్సవాల్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశభక్తిని చాటి చెప్పడానికి దేశ సమైక్యతను నాలుగు దిశల వ్యాపింప చేయడానికి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కీర్తించుకోవడానికి ఈ కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ) ఏఆర్ ఏసిపి ప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, ఆర్ఐ లు కిరణ్ కుమార్, రమేష్, జానీమియా లతో పాటుగా పరువులు పోలీసు అధికారులు పాల్గొన్నారు