Tuesday, 3 November 2026

కమీషన్‌ కాకతీయగా మారిన మిషన్‌ కాకతీయ-రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: టీప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం కమీషన్‌ కాకతీయగా మారిందని టి టిడిపి నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నేతలందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి 10నెలలు దాటినా ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే కేసీఆర్‌..ముందు పక్కలో బల్లెంలా తయారైన హరీష్‌రావును గమనించుకోవాలన్నారు. ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్ధులు కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *