Tuesday, 3 November 2026

కరవుతో రాష్ట్రం అల్లాడుతున్న కనికరం లేని కెసిఆర్‌

గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించి తెలంగాణ టిడిపి
హైదరాబాద్‌,మే6(జ‌నంసాక్షి): తెలంగాణలో కరువుతో లక్షలాదిమంది వలసపోతున్నా సిఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. కేసీఆర్‌ శ్రద్ధంతా పాలేరు ఉప ఎన్నికపైనే ఉందని ఆయన అన్నారు. కరవుపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేవఙంచాలని కోరుతూ టిడిపి బృందం శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ను  కలిసింది. ఈ మేరుకు వినతి పత్రం సమర్పించింది. మా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి కరువుపై గవర్నర్‌కు వివరించామని ఎల్‌.రమణ అన్నారు. ఉపాధిహావిూ కూలీలకు బకాయిలు ఇవ్వడం లేదని ఆయన కేసీఆర్‌పై మండిపడ్డారు. వచ్చేవారం ప్రధాని మోదీతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలుస్తామని ఎల్‌ రమణ అన్నారు. గతంలో కరువుపై మంత్రులను జిల్లాలకు పంపి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేవారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆంధ్రాపాలకులు చూపినంత కరుణ కూడా కేసీఆర్‌ తెలంగాణపై చూపడం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కోట్ల లీటర్ల నీటిని లిక్కర్‌ కంపెనీలకు కేసీఆర్‌ అమ్ముకుంటున్నారు, దీనిపై న్యాయపోరాటం చేస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు కలిశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిని ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *