హైదరాబాద్,మే6(జనంసాక్షి): బోయిన్‌పల్లి వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి తాను పని చేస్తున్న గోఎస్ లాబోరేటరీలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతిపై ఆమె తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ కూతురు మృతికి ల్యాబ్ యజమానే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని తమ కూతురును యజమాని వేధించాడని పేర్కొన్నారు. మృతురాలి పేరు సమత. ఆఎ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసలుఉ పోస్ట్‌మార్టమ్ కోసం గాంధీకి తరలించారు.




