హైదరాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : నగరంలోని గుడిమల్కాపూర్ నవోదయనగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ తగలడంతో ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థి హాజీని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు.




