హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. ఇంద్రారెడ్డి ఆల్వీన్ కాలనీలో చెత్త సేకరించేందుకు వెళ్లిన ఇద్దరు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అయితే అక్కడ తెగిపడిన వైద్యుత్ వైర్లు తాకడంతో ఇద్దరు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారిస్తున్నారు.




