Tuesday, 3 November 2026

కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యేకు కోర్టు రిమాండ్‌

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యేకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఎమ్మెల్యే  సురేష్‌కుమార్‌ను ఈరోజు ఏసీబీ పోలీసులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా నిందితునికి 14 రోజుల  రిమాండ్‌ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. గాలి బెయిల్‌ కేసులో సురేష్‌ను ఏసీబీ పోలీసులు నిందితునిగా  పేర్కొని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో గత రెండు రోజుల క్రితం ఆయన ఏసీబీ అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *