హైదరాబాద్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన కలాం సంతాప తీర్మానాన్ని అన్ని పార్టీలు బలపరచాయి. కలాం మృతి దేశానికి తీరని లోటని వామపక్ష పార్టీ నేతలు చెప్పారు. కలాం గొప్ప మానవతావాది అని కొనియాడారు. తెలంగాణలో నెలకొల్పబోయే యూనివర్సిటీలలో ఒకదానికి కలాం పేరు పెట్టాలని సీపీఐ కోరింది. కలాం పరమపదించడం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఈటల రాజేందర్ అన్నారు. దేశాభివృద్ధికి విద్యే మూలమని చాటిన గొప్ప వ్యక్తి కలాం అని చెప్పారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలో ఉందని, వారిని చైతన్యపరిచిన వ్యక్తి కలాం అన్నారు. కలాం ఆశయాలను స్పూర్తిగా తీసుకుని బంగారు తెలంగాణను నిర్మించుకుందామని ఈటల పిలుపునిచ్చారు




