Tuesday, 3 November 2026

కలాం లాంటి వ్యక్తి తెలుగు ప్రజలలో పుట్టాలి:

హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కలాంకు సంతాపం తెలిపే తీర్మానాన్ని టీడీపీ బలపరిచింది. కలాం మరణం దేశం మొత్తాన్ని కలచివేసిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కలాం చనిపోతే తన మనిషి చనిపోయారని దేశ ప్రజలంతా బాధపడ్డారని ఆయన చెప్పారు. చంద్రబాబు కలాంను రాష్ట్రపతి చేయాలని వాజ్‌పయ్‌కు సూచించారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. అలాంటి మంచి వ్యక్తిని రాష్ట్రపతిగా టీడీపీ ప్రతిపాదించడం గర్వించదగ్గ విషయమని ఆయన చెప్పారు. అబ్దుల్ కలాం మృతి తీరని లోటని అన్నారు. కలాం లాంటి వ్యక్తి తెలుగు ప్రజలలో పుట్టాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *