పోర్టు కోసం రైతుల భూములు తీసుకుంటే ఊరుకోం
మచిలీపట్నం పోర్టు నిర్మాణం పేరిట రైతుల నుంచి భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ హెచ్చరించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండువేల ఎకరాలతో ఆరు బెర్తులు నిర్మించుకోవచ్చని, కాని 33 వేల ఎకరాల భూమిని ఎందుకు సేకరించాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులకు సరైన ప్యాకేజీ ఇవ్వకుండా భూములను ఎలా తీసుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.