కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కల్యాణం
బ్రహ్మోత్సవానికి ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్ లక్ష రూపాయల కట్నం
ఖానాపూర్ రూరల్ 8 అక్టోబర్ (జనం సాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణం ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ లో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ చైర్మన్ రాథోడ్ రాము నాయక్ ఆధ్వర్యంలో జరిగాయి,ఈ బ్రహ్మోస్సవానికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్ దంపతులు ,నిర్మల్ జెడ్పి చైర్మన్ విజయలక్ష్మి రాం కిషన్ పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన యజ్ఞ హోమాలు నిర్వహించిన అర్చకులు చక్రపాణి నరసింహ మూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు కోటపెళ్లి అనిష్,ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించించి స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిదులుగా పాల్గొన్న ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్,జెడ్పి చైర్మన్ విజయలక్ష్మి రాం కిషన్ దంపతులకు ఆలయ చైర్మన్ రాథోడ్ రాము నాయక్ తీర్థప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.