|
*తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
*సీఐటీయు బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్
కూకట్ పల్లి జనంసాక్షి
:కూకట్ పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్లలో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరాలో కలుషిత నీరు రావడంతో సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ మంచినీటి సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.కలుషిత నీటి ప్రభావం వల్ల గర్భిణీ స్త్రీలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని డివిజన్ పరిధిలోని కాలనీలు,బస్తీలలో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల వర్షాల కారణంగా గోదావరి నీరు తాగునీటి సరఫరాలో కలుషిత మవుతున్నా వాటర్ వర్క్స్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించక పోవడం దుర్మార్గమని, తప్పని పరిస్థితుల్లో కలుషిత తాగు నీరు వాడడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గరవుతూ వ్యాధుల బారిన పడితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులే భాద్యత వహించాలని హెచ్చరించారు.ఇప్పటి కైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మంచి నీటి సమస్యను తక్షణమే పరిష్కారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారతి, రహిమా బేగం, అనిత, లక్ష్మీ, ఉమ తదితరులు పాల్గొన్నారు.
|
కలుషిత నీరు వస్తున్న పట్టించుకోని అధికారులు




