కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆయా సంఘాల నాయకులు యత్నించారు. అందులో భాగంగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారుఏ. దాంతో పరిస్థితి ఒక్కసారి ఆ ఉద్రిక్తంగా మారింది. దాంతో పలువురు విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.