హైదరాబాద్,మే11(జనం సాక్షి ): సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో కల్తీ నెయ్యి స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రూ. 1 లక్ష విలువైన కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న నిర్వాహకుడు బాలసుబ్రహ్మణంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.




