హైదరాబాద్,మే11(జనం సాక్షి ): సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మండలి చీఫ్‌విప్ సుధాకర్‌రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవీప్రసాద్ హాజరయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లు, సమస్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల కమిటీ.. రాత్రి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. మంత్రుల కమిటీ నివేదిక పరిశీలించిన తర్వాత.. ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చించనున్నారు.
ఆర్థికశాఖ అధికారులతో మంత్రి ఈటల చర్చలు




