కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లు కెసిఆర్ మానస పుత్రికలు ఎమ్మెల్యే మదన్ రెడ్డి

శివ్వంపేట అక్టోబర్ 1 జనంసాక్షి : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు సీఎం కేసీఆర్ మానస పుత్రికలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేట లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల బిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక సహకారం అందిస్తూ వారి పాలిట వరంలా మారాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, స్థానిక కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  చంద్ర గౌడ్,  టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, తహసిల్దార్ శ్రీనివాస్ చారి, ఆర్ఐ కిషన్, వెల్దుర్తి ఎంపీపీ నరేందర్ రెడ్డి  రమణ గౌడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చెర్మన్ వెంకట్రాంరెడ్డి, ఆత్మకమిటి చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ గారు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు రవి నాయక్, ఎంపీటీసీ సత్తిరెడ్డి, శివంపేట సర్పంచ్ శ్రీనివాస్, సర్పంచులు అశోక్, చెన్నా నాయక్,  ఉసిరిక పల్లి సర్పంచ్ బాబురావు రాజు, బీసీ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,  చిగుళ్లపల్లి శ్రీనివాస్ గుప్తా, అలాగే స్థానిక ఎంపీటీసీలు సర్పంచ్ లు వార్డ్ నెంబర్లు నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.