దండేపల్లి జనంసాక్షి మార్చి 16 దండేపల్లి తహసీల్దారు కార్యాలయం లో మండలానికి చెందిన 132 మంది కళ్యాణలక్ష్మి , షాదీముభారక్ లబ్దిదారులకు చెక్కులను గురువారం పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెళ్లి దివాకర్ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తీసికువచ్చిన ప్రతీ పథకం తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేల ఉంటుందని అందులో ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డకు తెలంగాణ ప్రభుత్వ పెళ్లి కానుకగా చెప్పుకునే కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ లు ఎంతో గొప్ప పథకాలని , ఈ పథకాల ద్వారా పేదింట పెళ్లి వేల ఆనందం వెళ్లివిరుస్తుందని అన్నారు, తెలంగాణ యావత్ ప్రజానికం మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నారని, ఇకపై కూడా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,తహశీల్దార్ హన్మంతరావు, వైస్ ఎంపీపీ అనిల్,ముత్తె రాజన్న, సహకార సంఘం చెర్మెన్ లింగన్న,డైరెక్టర్ నలిమేల మహేష్,పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,మండల యూత్ అధ్యక్షకార్యదర్శులు గాండ్ల నరేష్, గొల్లపల్లి. అజయ్, మాజీ ఎంపీపీ మల్లేష్,మాజీ వైస్ ఎంపీపి ఆకుల రాజేందర్,నాయకులు శంకర్ రావు,గోళ్ళ రాజమల్లు, సర్పంచ్ డంక లక్ష్మణ్, ఎంపీటీసీ బత్తుల మౌనిక,గూడెం సహకార సంఘం చెర్మెన్ సురేష్,ఉప సర్పంచ్ భూమన్న,రేణి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.





