కల్లబొల్లి మాటలు చెబుతూ కండువాలు కప్పుతున్నారు * బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జోలికొస్తే ఊరుకోం * ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
టేకులపల్లి, ఆగస్టు 3 (జనం సాక్షి ): కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరం కనుకయ్య ఇల్లందు నియోజకవర్గంలో తన మనుగడ కోసం అధికార పార్టీ ఎంపీటీసీలకు ఎర వేసి మాయ మాటలు చెప్పి మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. గత రెండు రోజుల క్రితం ఇల్లందులో కాంగ్రెస్ సభలో కోరం కనకయ్య మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలకు కాంగ్రెస్ కండువాలు కప్పారన్నారు. మళ్లీ తిరిగి అదే రోజు కండువాలు కప్పుకున్న ఎంపిటిసిలు తమ వద్దకు వచ్చి మాకు మాయ మాటలు చెప్పి మాట్లాడుదాం రండని కనకయ్య పిలవడం జరిగిందని ఎంపీటీసీలు తెలియజేశారన్నారు. వారు ఎంతో పశ్చాతాప పడుతూ తమ వద్దకు వచ్చి జరిగిన మోసాన్ని తెలిపారన్నారు. కాంగ్రెస్ లో కూడా కోరంకు టికెట్ వచ్చే పరిస్థితి లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులను మభ్యపెడుతూ తన బలాన్ని చూపేందుకు కోరం కనకయ్య పావులు కదుపుతున్నారన్నారు. మీ కల్లబొల్లి మాటలకు మోసపోయే పరిస్థితిల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరనే విషయాన్ని గ్రహించాలన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కనకయ్య ఓడిపోతే జెడ్పీటీసీగా గెలిపించుకుని జడ్పీ చైర్మన్ పదవి ఇస్తే పార్టీకే వెన్నుపోటు పొడిచిన విషయం ప్రజలకు తెలుసన్నారు. పదవి ఇచ్చి మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టిన కనకయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉండాల్సింది పోయి దిగజారుడు రాజకీయాలు చేయడం విచారకరమన్నారు. ఇంటి దేవుడికి దన్నం పెట్టకుండా బయట వారికి అన్నం పెడతా అన్న విధంగా కనకయ్య వ్యవహారం కనబడుతుందని ఎద్దేవా చేశారు. పొంగులేటిని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ టిక్కెట్ల