ప్రజల కోసం… ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీ. ఇంటింటి కి తెలుగుదేశం పార్టీ ప్రచారం.

 

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 3 మండలం మైలారం గ్రామంలో
మన బహుజన ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ డాక్టర్,, పగిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం..ప్రగతి కోసం ఇంటింటి కి ప్రచారం లో బాగంగా కరపత్రాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
కొల్లాపూర్ నియోజకవర్గం బలహీన వర్గాల ఆశాజ్యోతి బహుజన ముద్దుబిడ్డ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రజా డాక్టర్,,పొగిడారు శ్రీనివాసులు ప్రజలనే దేవుళ్ళుగా భావించే మన బడుగు,బలహీన వర్గాల రాజ్యాధికారం “దిశగా” సంక్షేమ పాలన కోసం కొల్లాపూర్ అభివృద్ధి కోసం డాక్టర్ పగడాల శ్రీనివాసులు సైకిల్ గుర్తుకి మన అమూల్యమైన మన ఓటు వేసి గెలిపించుకుందాం అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సారి కొల్లాపూర్ కోటపైన పసుపు జెండా ఎగరేద్దాం కొల్లాపూర్ ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సాయిధీరజ్ యువ నాయకులు, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వి సుధాకర్ కొల్లాపూర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఉడత రామస్వామి యాదవ్ నాగర్ కర్నూల్ పార్లమెంటు ఉపాధ్యక్షులు, ఒర్సు రామకృష్ణ,కోడేర్ మండల పార్టీ అధ్యక్షుడు, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు పుల్దండి మై బుస్,గ్రామంలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు