Wednesday, 4 November 2026

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి…

కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్.

కొమురవెల్లి జనం సాక్షి
సిద్దిపేట జిల్లాలోని
దుద్దేడ  వైష్ణవి పంక్షన్ హల్ లో ఈ నెల 14న జరిగే తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్.ఈ సందర్బంగా బుధవారం కొమురవెల్లి మండల కేంద్రంలోని గౌడ సంగం నాయకులకు కరపత్రాలను అందజేశారు.14న జరిగే జిల్లా ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ముత్యం పర్శరాములుగౌడ్ శివలింగు రమేష్ గౌడ్ ముత్యం కర్ణాకర్ గౌడ్ దోమట ఆంజనేయులు గౌడ్ ముత్యం పర్శరాములు గౌడ్  బత్తినీ నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు