మన ఊరు-మనబడి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ముషారఫ్ ఫారుఖీ.
నిర్మల్ బ్యూరో, అక్టోబర్18,జనంసాక్షి,,, పట్టణం లోని ఆష్రా కాలనీ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా పాలనాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రెండు పాఠశాలలో ప్రారంభించబడ్డ మన ఊరు-మనబడి పనులను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు -మనబడి పనులను నాణ్యతగా నిర్వహించి, గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఏఈల సమన్వయంతో పనులను త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆరిగేలసంపత్ కుమార్సె, సేక్టోరల్ అధికారి శ్రీ సామల రాజేశ్వర్, స్థానిక కౌన్సిలర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.