కల్వచర్ల లో కూలిపోయిన ధర్మశాల.

రామగిరి, జనంసాక్షి : జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలోని ధర్మశాల కూలిపోవడం జరిగింది. స్థానిక సర్పంచ్ గంట పద్మ వెంకటరమణారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల కనకయ్య పాల్గొన్నారు