ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన మార్కెట్ చైర్మన్
(జనంసాక్షి) జులై 13 : తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ నూతనంగా ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా బుధవారం వారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.