*కవ్వగుడలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ రమేష్*
రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవ్వగుడ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ రమేష్ యాదవ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ ప్రకటించి ప్రతి ఒక్కరి ఇంటిలో దసరా పండుగను సంతోషంగా చేసుకోవాలని ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి చీరలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు మరవకుండాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మావతి, వార్డు సభ్యులు ప్రవీణ్, చంద్రయ్య, సత్యమ్మ, దేవేందర్, అరుణ, వెంకటేష్, నరేష్,పోచమ్మ, లత, మహిళా మండలి సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : కవ్వగుడలో చీరలు పంపిణీ చేస్తున్న సర్పంచ్ రమేష్ యాదవ్.
Attachments area