Wednesday, 4 November 2026

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో

నులిపురుగుల నిర్మూలనలో భాగంగా  విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): కస్తూర్బా గాంధీ బాలికల  విద్యాలయంలో జాతీయ నులిపురుగుల నిర్మూలనలో భాగంగా  విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను గ్రామ  సర్పంచ్ త్రిపురం సీతారాం రెడ్డి  చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.వారు మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలు మింగడం వలన పిల్లలకు మానసిక శారీరక ఎదుగుదల ఉంటుందన్నారు. డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు మింగాలని సూచించారు. ఐదు పద్ధతుల ద్వారా ప్రతి రోజు చేతులను శుభ్రపరచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ ప్రమీల, సూపర్వైజర్ అంజయ్య గౌడ్ ,ఎస్ ఓ శైలజ , ఉప సర్పంచ్ సైదాబీ, ఏఎన్ఎంఎస్ కవిత ,అంజలి, ఉపాధ్యాయులు ఆయుష్ డిపార్ట్మెంట్ రేణుక , ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.