హైదరాబాద్: రాష్ట్రంలో ఏ కార్పోరేట్ పాఠశాలతోనైనా పోటీపడే సత్తా కస్తూర్బా బాలికా విద్యాలయ విద్యార్థినులకు ఉందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. హైదరాబాద్ లాల్‌బహుదూర్ స్టేడియాంలో కేజీబీవీ విద్యార్థులకు రాజీవ్ విద్యామిషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీల్ని ఉపసభాపతి భట్టివిక్రమార్కతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇందులో దాదాపు 19 జిల్లాలకు చెందిన 1500 మంది విద్యార్థినులు పాల్గొంటున్నారు. బడికి దూరంగా ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన బాలికలకు విద్యనందించే లక్ష్యంతో మొదలుపెట్టిన కస్తూర్బా విద్యాలయాలు విజయవంతంగా నడుస్తున్నాయని శైలజానాధ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన మార్చ్‌పాస్ట్, నృత్యాలు అలరించాయి.




