శ్రీకాళహస్తి : ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈరోజు శ్రీకాళహస్తిలో సాంస్కృతిక కళావేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాత్రం భగవంతుడిచ్చిన వరమన్నారు. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గడం, పెరగడం అంటూ ఉండదని, దాని విలువ ఎప్పటికీ అలాగే ఉంటుందని బాలమురళీకృష్ణ అభిప్రాయపడ్డారు.




