హైదరాబాద్ : కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతుంటే ఆర్థిక మంత్రి చిదంబరం బంగారం కొనుగోలు చేయవద్దంటూ… ఉచిత సలహాలు ఇస్తున్నారు. తప్ప ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు.




