పంచాయితీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి
నిర్మల్,మే31(జనం సాక్షి): నిర్మల్ మండలం చిట్యాల్‌లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మయాట్లాడుతూ వచ్చే పంచాయితీ ఎన్న్నికల్లో టిఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందన్నారు. టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే సిఎం కెసిఆర్ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సహా ఏ ఇతర ప్రతిపక్ష పార్టీకి తావు లేదని, తెలంగాణ పౌర సమాజమంతా టీఆర్‌ఎస్ వెంటే నడుస్తుందని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణవ్యాప్తంగా అభివృద్ధి పనులు ఒక జాతరలా నడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలో ఇక ఎవరూ మిగలరని… తెలంగాణలో టీఆర్‌ఎస్ తప్ప ఏ పార్టీకి స్థానం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన నాలుగేళ్లలో రాజకీయాలన్నీ పక్కన పెట్టి అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టారని అన్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలందరూ టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని ఆ పార్టీలకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి కార్యక్రమాల అమలుకు ఎన్నికలకు ముందు కేసీఆర్ హావిూ ఇవ్వలేదని అన్నారు. ఆ పార్టీలకు 2019లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారన్నారు.




