– ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
హైదరాబాద్, మే8(జనం సాక్షి) : కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌లు వేగంగా పూర్తవుతుండడంతో కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను టూరిజం స్పాట్‌గా మార్చారని జీవన్‌రెడ్డి హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. సాగునీటి రంగంపై జీవన్‌రెడ్డి అవగాహనతో మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే రైతు ఆత్మహత్యలు తగ్గేవని కర్నే పేర్కొన్నారు. అన్నిటిని విమర్శించడమే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని, పాస్‌పుస్తకాలపై ఉత్తమ్ ఆరోపణల్లో పస లేదని ఎమ్మెల్సీ కర్నె పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు కేవలం రాజకీయాలే తప్ప ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలవాలని లేకపోవటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కేసీఆర్ ఓ యజ్ఞంలా ముందుకు సాగుతున్నారని, దీనిలో భాగంగా రైతులకు పెట్టుబడి చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. చెక్కుల పంపిణీని ప్రతి ఒక్కరూ పండగల జరుపుకోవాలని కర్నె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని, 2019లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడ్రస్సు గల్లంతవుతుందని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ నేతలు మంచి కార్యక్రమాలపైన విమర్శలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిణ గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.




