Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌ నేతలు డ్రామాలు మానాలి

 

నేరెళ్ల బాధితులకు పూర్తిస్థాయి వైద్యం: లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): నేరెళ్ల బాధితులకునిమ్స్‌లో వైద్యం అందించలేదని కాంగ్రెస్పార్టీ నేతలు నానాయాగీ చేయడాన్ని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. నేరెళ్ల కు చెందిన ఆరుగురు నిమ్స్‌ హాస్పిటల్‌ ట్రీట్‌ మెంట్‌ వచ్చిన సందర్భంగా మాట్లాడిన మంత్రి.. వారికి అన్ని వైద్య సేవలను నిమ్స్‌ వైద్యులు అందించారన్నారు. వారికి అత్యవసరమైన వైద్య సేవలు అవసరం లేదని డాక్టర్లు దృవీకరించారన్నారు. ఓపీ ద్వారా చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచించారన్నారు. వైద్యుల సూచనకు వారు కూడా అంగీకరించినట్లు తెలిపారు.

అయితే… కాంగ్రెస్‌ నేతలు నిమ్స్‌ హాస్పిటల్‌ ముందు డ్రామాలు ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ నేతలు అమాయకులను అడ్డం పెట్టుకొని నిమ్స్‌ వైద్యులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్‌ నేతలు హాస్పిటల్‌ కు వచ్చి రాద్దాంతం చేశారన్నారు. రాజకీయ నాయకుల డ్రామాలను బాధితులు నమ్మొద్దని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. కాంగ్రెస్‌ నేతలు వారిని కేర్‌ హాస్పిటల్‌ కు తీసుకెళ్లినా.. అక్కడి వైద్యులు ఓపీ ట్రీట్‌ మెంట్‌ మాత్రమే అవసరమని తేల్చారన్నారు. అమాయకులతో కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. జానారెడ్డి వారిని పక్క రాష్టాన్రికి తీసుకెళ్లి ట్రీట్‌ మెంట్‌ ఇప్పిస్తామని మాట్లాడుతున్నారన్నారు. నిమ్స్‌ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. వారికి అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బాధితులకు ఎంత ఖర్చైనా తాము భరిస్తామన్నారు.