Tuesday, 3 November 2026

భూమాయ కేసులో బూడిదకు చిక్కులు

యాదాద్రి భువనగిరి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయనతోపాటు భార్య సువర్ణ, కొడుకు ప్రవీణ్‌ కూడా చిక్కుల్లో పడ్డారు. 2015 సంవత్సరంలో ఫోర్జరీ సంతకాలతో 250 ఎకరాలు కబ్జా చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే… ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌, ఆయన భార్య, కొడుకు ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. కాగా.. వీరి బెయిల్‌ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేస్తామని డీసీపీ యాదగిరి విలేకరులకు తెలిపారు. త్వరలోనే మరో ఇద్దరు నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. కాగా… ఈ భూకబ్జా వ్యవహారం ఎమ్మెల్యే కుటుంబీకులను చిక్కుల్లో పడేయనుందని తెలుస్తోంది. అంతేగాక ఆయన రాజకీయ భవిష్యత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.