Thursday, 5 November 2026

కాంగ్రెస్‌ నేతల్లో రాహుల్‌ జోష్‌

నేరుగా క్లాసిక్‌ గార్డెన్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): హైరదాబాద్‌కు రాహుల్‌ రాకతో కాంగ్రెస్‌ నేతల్లో జోష్‌ కనిపించింది. రాహుల్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా క్లాసిక్‌ గార్డెన్‌కు చేరుకున్నారు. తెలంగాణ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద సభను ప్రారంభించి స్వాగతోపన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, సంపత్‌, పొన్నాల లక్ష్మయ్య, నంది ఎల్లయ్య, మల్లు రవి, ప్రతాప్‌ రెడ్డి, శ్రీదర్‌ బాబు, బలరాం నాయక్‌, స్థానిక నేతలు.. తదితరులకు శారద స్వాగతం పలికారు.తెలంగాణాకు విభజన హావిూలను కాంగ్రెస్‌ నెరవేరుస్తుందని.. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక ¬దాపై సీడబ్ల్యూసీ తీర్మానానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రత్యేక ¬దాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస ఎంపీ కవిత ఒక తీరు, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌ మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రజల ఆశలను వమ్ము చేశారని ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందంటున్న రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.