Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

నల్లబెల్లి ఆగస్టు 23 (జనం సాక్షి):
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు కుసుంబ రఘుపతి పేర్కొన్నారు. మండలంలోని రేలకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ గ్రామ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు. నూతన అధ్యక్షుడిగా కూచన చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా ధనుసునదుల నరేష్, ఉపాధ్యక్షుడిగా ఎలబోయిన వినయ్, గుజుల రాజు, రచ్చ రమేష్, సహాయ కార్యదర్శిగా జూనూరి సాంబయ్య, కోశాధికారిగా పప్పు రాజ్ కుమార్, సభ్యులు దీకొండ బిక్షపతి, పప్పు శ్రీను, ఎలబోయిన సాంబయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఆర్షం యాకయ్య, నందిగామ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిలి మోహన్, నాయకులు రవీందర్, తిరుపతిరావు, రఘుపతి, రాజకుమార్, రాజన్న, శ్రీను, చారి, సురేష్ పాల్గొన్నారు.