*కాంగ్రెస్ పార్టీలో చేరిన మాధవరావుపల్లి గ్రామస్తులు*
పానుగల్ సెప్టెంబర్ 16( జనం సాక్షి)
మండల పరిధిలోని మాధవరావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు మరియు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి రంగినేని అభిలాష్ రావు ఆహ్వానించారు.ఈ సంధర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం రావాలన్న, భవిష్యత్తు మారాలన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం… అది రేవంతన్న నాయకత్వంలోనే సుసాధ్యమని అభిలాష్ రావు తెలిపారు. కేంద్రంలో మోడీ మరియు రాష్ట్రంలో కేసిఆర్ ప్రజలను మభ్యపెడుతూ నట్టేట ముంచుతున్నరని మండిపడ్డారు. నిత్యవసర వస్తువుల ధరలు మరియు గ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలు అత్యధికంగా ఇష్టానుసారంగా పెంచుకొంటూ సామాన్య ప్రజలను నిట్టనిలువుగా దోపిడి చేస్తున్నారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై అభిలాష్ రావు ధ్వజమెత్తారు.భూదానోద్యమ సమయంలో భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరియు ఆచార్య వినోబా భావే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా మాధవరావుపల్లి గ్రామానికి రావడం గొప్ప విశేషంగా మననం చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పానుగల్ మండల మాజీ సర్పంచ్ కుమ్మరి బాలస్వామి ,వనపర్తి జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి రమేష్ ,తాలుకా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వహీద్ ,మండల ఉపాధ్యక్షులు కురుమూర్తి,రాఘవేంద్ర మరియు గ్రామ పెద్దలు,మహిళలు తదితులు పాల్గొన్నారు.