కాంగ్రెస్ పార్టీలో చేరిన తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ గంకిడి

 

 

 

 

 

తిమ్మాపూర్, అక్టోబర్ 18 (జనం సాక్షి):
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి తన అనుచరులతో కలిసి కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్బంగా గంకిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మానకొండూర్ స్థానిక ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడి పనిచేస్తే గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుండి వచ్చిన రియల్ ఎస్టేట్ మాఫియా,భూ మాఫియా ఎజెంట్లకు, బ్రోకర్లకు పదవులు అమ్ముకొని అతని గెలుపు కోసం పనిచేసిన నాయకులను అనేక విధాలుగా అవమానించడంతో తెరాస పార్టీకి రాజీనామా చేసి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ప్రజా నాయకులు డా.కవ్వంపల్లి, పొన్నం ప్రభాకర్ గార్ల గెలుపు కోసం మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాం అని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి ఎంపీటీసీ బండారి రమేష్,మాజీ సర్పంచ్ బుడిగే కొండయ్య,గోపు మల్లారెడ్డి,మామిడి అనిల్ కుమార్, గవ్వ రాజేందర్ రెడ్డి,చిన్నబోయిన రవి, నగునూరి శ్రీనివాస్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.