ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కి నివాళులు టేకులపల్లి,జనవరి 30( జనం సాక్షి ): టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగింపు సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ రాసమళ్ళ నరసయ్య, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు బానోత్ సరిలాల్, బోడ భీముడు నాయక్, ఉండేటి దేవరాజు, బల్లెం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




