Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

బోయిన్ పల్లి జున్ 02 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో శుక్ర వారం రోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా టీపీసీసీ, జిల్లా కాంగ్రెస్ పిలుపు మేరకు బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు అనంతరం స్వీట్ లు పంపిణి చేసారు. బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మి పతి గౌడ్,మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య గార్లు మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ఆంధ్ర రాష్ట్రం లో పార్టీ మనుగడ కోల్పోతుంది అని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు సోనియా గాంధీ కి రుణపడి ఉండాలనీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకోని వచ్చి సోనియా గాంధీ కి బహుమతి గా తెలంగాణ ప్రజలు ఇవ్వాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి అనుకుంటే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఏ కోరిక నెరవేరలేదు.తెలంగాణ ప్రజల కోరికలు నెరవేరాలి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది.కచ్చితంగా మనం అందరం కృషి చేసి తెలంగాణ లో బి ఆర్ ఎస్ పాలనకి చేరామ గీతం పడి మన కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకురావాలనీ అన్నారు
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు , ఎండీ బాబు, బోయిని ఎల్లేష్, గుడి శేఖర్ రెడ్డి, గంగిపెల్లి లచ్చయ్య, మహేందర్, లాల్ కనుకయ్య,దూస రామస్వామి , దూస జనార్దన్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, క్రాంతి కిరణ్, వంశీ, అభిలాష్ మరియు తదితరులు పాల్గొన్నారు.