కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగేపల్లి గ్రామంలో వరద బాధితులకు బియ్యం పంపిణీ

 జనంసాక్షి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి ,అడవి సోమన్ పల్లి గ్రామాలలో గత నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాలకు మానేరు నది ఒడ్డున ఉన్న ఇళ్లలకు వాటర్ వచ్చి చాలా నష్టం జరిగింది. వాళ్ల కుటుంబాలకు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండం మధు, అడవి సోమనపల్లి సర్పంచ్ కొటారి శారద బాపు, దబ్బేట మహేందర్. మాచిడి రమేష్ గౌడ్, కుంభం సమ్మయ్య, ఆకాష్, కుమార్, కుంభం సమ్మిరెడ్డి, ఆరెల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు