వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవార్ రామారావు పాటిల్
భైంసా జనం సాక్షి జూలై27
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని నంద్ గావ్, బీంబార్ గ్రామాలలో
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ వరద ప్రవాహపు నీటి వల్ల గ్రామాల్లోకి వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని అంతేకాకుండా , పంట పొలాల్లో అధిక మొత్తంలో వర్షపు నీరు మరియు మట్టి చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లందని అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి తగు సహాయ చర్యలు ప్రారంభించి గ్రామాల రాకపోకలకు వీలుగా తగు రోడ్డు మార్గం కల్పించాలని కోరారు .మరియు నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు .వీరితోపాటు మీర్జాపూర్ ఎంపీటీసీ రజాక్, ఉప సర్పంచ్ శ్యామ్, శివాజీ పటేల్, మాజీ సర్పంచ్ చక్రధర్ పటేల్, మారుతి,మాధవ్ రావ్ కొలూర్
ఎళ్ళప్ప ,సురేష్ పటేల్ ,గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు సురేష్,అసిఫ్, సాయి లు,సరస్వతి,సంతోష్,నర్సింలు,శంకర్ , శంకర్ తదితులున్నారు