కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎండి ముల్తానీ

జహీాబాద్: ఆగస్టు 18 (జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎండి ముల్తానీ ను నియమించారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి ఆదేశాల మేరకు ఝరసంగం మండలం మచునూర్ గ్రామానికి చెందిన ఎండి ముల్తానీని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ శుక్రవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులైన ఎండి ముల్తానీ జహీరాబాద్ నియోజకవర్గస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం వల్ల ఆయనను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండి ముల్తానీ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, అలాగే జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు ముల్తానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎండి ముల్తానీ పేర్కొన్నారు.