Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

 

 

 

 

 

దండేపల్లి జనంసాక్షి 06 దండేపల్లి మండలం లోని పెద్దపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులుసోమవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంట మల్లన్న,పెంట శ్రీకాంత్,అయిందల నగేష్,గాజుల రవి,పెంట భూమన్న,అయిందల తిరుపతి,పెంట మల్లేష్ వీరితోపాటు 30 మంది పార్టీ లో చేరడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతం చేసేందుకు చేరారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,బి అర్ స్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,రైతు సమన్వయ సమితి కన్వీనర్ మోటపలుకుల.గురవయ్య,ప్రజాప్రతినిధులు,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.