కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంచాడీ క్రిష్ణ
అనంతగిరి ఫిబ్రవరి16 (జనం సాక్షి): అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం అరకు వ్యాలీ లో ఈనెల 21న నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ జిల్లా ఇంచార్జ్ శాంతకుమారి ఆదేశాల మేరకు అనంతగిరి మండల అధ్యక్షుడు పంచాడీ.క్రిష్ణ బుదవారం పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న జరగే కాంగ్రెస్ పార్టీ మహా సభను రాష్ట్ర పార్టీ పి సి సి అధ్యక్షుడు సాకే శైలదానాధ్.తులసిరెడ్డి తో పాటు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఆర్.జి.పి.ఆర్.ఎస్.నేషనల్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ లుహా విచ్చేయు చున్నందుకు గాను,పార్లమెంట్, మండల, పరిధిలో గల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి కృష్ణ కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.