*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలకి అర్జున మృతి*

కోదాడ. జులై 19(జనం సాక్షి)
కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల అధ్యక్షులు పాలకిఅర్జున్ మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై కోదాడ వెళ్తుండగా అశోక్ నగర్ వద్ద ట్రాలీ ఆటో ఢీకొని రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో చౌటుప్పల్ దగ్గర తుది శ్వాస విడిచారు. ఆయన మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా, రెండుసార్లు గ్రామ సర్పంచ్ గా, రెండు సార్లు ఎంపీటీసీగా పదవులు చేపట్టి పేదవారికి సంక్షేమ పథకాలను చేరవేస్తూ గ్రామాభివృద్ధిలో తనదైన ముద్రవేశరు. మొదట నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ  బలోపేతానికి వారు అహర్నిశలు కృషి చేశారు. ప్రస్తుతం కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అలవలపురం, ద్వారకుంట గ్రామ ఎంపీటీసీగా కొనసాగుతున్నారు.

తాజావార్తలు